థాయ్ కుర్రాళ్ళ గుహలో నేవీ మాజీ డ్రైవర్ డెత్

థాయ్‌లాండ్ మెసాయిలోని థామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 12 మంది కుర్రాళ్ళను, వారి ఫుట్‌బాల్ కోచ్‌ను రక్షించబోయిన నేవీ మాజీ డ్రైవర్ మరణించాడు. ఈ ‘ఆపరేషన్’లో సమన్ కునోంట్ అనే ఆ డ్రైవర్ సమయానికి ఆక్సిజన్ అందక, అపస్మారక స్థితిలోకి వెళ్లి నీట మునిగి మరణించినట్టు అధికారులు తెలిపారు.

ఈ ఘటనతో గుహలోని చిన్నారులను ఎలా రక్షించగలుగుతామన్న ఆందోళన.. సహాయక చర్యల్లో నిమగ్నమైన సైనికులు, అధికారుల్లో మొదలైంది. వరదలు, వర్షాల కారణంగా ఈ గుహలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.

గుహలో చిక్కుకున్న వాళ్ళంతా 11 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళ లోపువారే.. వీళ్ళలో ఎవరికీ ఈత రాదు కూడా. వీరికి ఆహరం, మందులు తీసుకువెళ్లేందుకు గుహలో ప్రవేశించిన సమన్ అనే ఈ డ్రైవర్ తిరిగి రాబోతూ మృత్యువాత పడ్డాడు. ఇతని డెడ్‌బాడీని అటాప్సీ కోసం ఆసుపత్రికి తరలించారు.