సీఎం కేసీఆర్ కేబినెట్ విస్తరణ తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడారు మాజీమంత్రి హరీశ్‌రావు. కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్నవాళ్లకి అభినందనలు తెలిపారు. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై స్పందించారు ఆయన. తాను ఎన్నికలకు ముందు కూడా చాలా సార్లు చెప్పానని, టీఆర్ఎస్‌లో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని, అధినేత కేసీఆర్ ఏది ఆదేశిస్తే, దాన్ని తప్పకుండా పాటిస్తానన్నారు. ప్రాంతాలు, రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారని, అధినేత ఏ పని అప్పగించినా నిర్వహిస్తానని, ఈ విషయంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. తన పేరిట వస్తున్న వార్తలను ఖండించారు హరీష్‌రావు. తన పేరిట సోషల్‌మీడియా గ్రూప్ ల్లేవని ఎవరైనా అలా క్రియేట్ చేస్తే వాటిని తొలగించాలని కోరారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *