ఇక ‘ఎఫ్ 2 ’ హంగామా .. నవ్వులే నవ్వులు..

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రం ‘ఎఫ్ 2 ’ (ఫన్ అండ్ ఫ్ర‌స్ర్టేషన్) రేపు (శనివారం) ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తన ట్విటర్ ద్వారా తెలిపారు.

30 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమై.. జులై 20 వరకు జరుగుతుందని తెలుస్తోంది. వెంకీ సరసన తమన్నా, వరుణ్‌కి జోడీగా మెహరీన్ పీర్జా నటించనున్నారు. పూర్తి కామెడీగా సాగే ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్ తోడల్లుళ్ళుగా నవ్వులు పండిస్తారట. శ్రీవెంకటేశ్వర పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.