ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాలు తమ పట్ల పక్షపాత ధోరణి చూపుతున్నాయని, తమ ప్రకటనలను సెన్సార్ చేస్తున్నాయని బీజేపీ ఎంపీలు ఆరోపిస్తున్నారు. మీ సంగతి తేలుస్తామని హెచ్చరిస్తున్నారు. తాజాగా ఈ పార్టీ ఎంపీ అనురాగ్ ఠాకూర్.. ఫేస్‌బుక్ నిర్వాహకులపై మండిపడ్డారు. పార్లమెంటరీ ఐటీ కమిటీ హెడ్ కూడా అయిన ఈయన.. ఈ సామాజిక మాధ్యమాలపై తమకెన్నో ఫిర్యాదులు అందాయని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, వీటి నిర్వాహకులను తమ ముందు హాజరు కావలసిందిగా కోరనున్నామని తెలిపారు.

ముఖ్యంగా ట్విటర్, ఫేస్‌బుక్ నిర్వాహకులు మా కమిటీ ముందు హాజరై, వివరణ ఇవ్వాల్సిందే అని ఆయన పేర్కొన్నారు. తాము చేసే ప్రసంగాలను, తమ అభిప్రాయాలను ఇవి దాదాపు వక్రీకరిస్తున్నాయని ఆయన విమర్శించారు. తరచూ సెన్సార్ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. కాగా-తాము ఈ కమిటీ ఎదుట హాజరయ్యే ప్రసక్తే లేదని ట్విటర్ ఇండియా లీగల్ హెడ్ విజయ గద్దె తోసిపుచ్చుతూ, తమకు ‘ సంజాయిషీ ‘ ఇచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేయగా.. అనురాగ్ ఠాకూర్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము త్వరలో కఠిన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయన్నారు.


ఫేక్ న్యూస్ ఇస్తున్నారని, దీనిపై మీ వాంగ్మూలం ఇవ్వాలని ఆ మధ్య ఫేస్‌బుక్ నిర్వాహకులను అమెరికాలో కోరిన సంగతి తెలిసిందే. సింగపూర్ వంటి దేశాల్లోనూ ఈ సామాజిక మాధ్యమం ఇలాగే ‘ వ్యతిరేక పోకడలను ‘ ఎదుర్కొంది. తాము పారదర్శకతకు, నిష్పాక్షికతకు కట్టుబడి ఉన్నామని, ఎవరిపట్లా పక్షపాతం చూపే ప్రసక్తి లేదని ట్విటర్ హెడ్ కోలిన్ క్రోవెల్ ప్రకటించినప్పటికీ, బీజేపీ, ఇతర ప్రధాన పార్టీల ఆగ్రహం చల్లారేట్టు కనిపించడం లేదు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *