నాలుగైదు రోజుల్లో పట్టాలెక్కనుంది ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’. ఇందుకు సంబంధించిన పనులు పూర్తి అయ్యాయి. ఫిబ్రవరి 15న ప్రధాని మోదీ చేతుల మీదుగా ఢిల్లీలో ఈ ట్రైన్‌ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి వారణాసి మధ్య రాకపోకలు సాగించనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారత తొలి ఇంజిన్‌ రహిత రైలులో టిక్కెట్‌ ధరలు ఖరారయ్యాయి. ఎగ్జిక్యూటివ్‌, చైర్‌ కార్ అనే రెండు తరగతులు వుంటాయి. ఏసీ చైర్‌ కార్‌ ధర రూ.1,850 కాగా, ఎగ్జిక్యూటివ్‌ తరగతి టిక్కెట్‌ ధర రూ.3,520.

తిరుగు ప్రయాణంలో చైర్‌ కార్‌ టిక్కెట్‌ను రూ.1,795కు, ఎగ్జిక్యూటివ్‌ టిక్కెట్‌ని రూ.3,470కు లభించనుంది. శతాబ్ధి రైలు కన్నా.. ఈ ట్రైన్-18లో చైర్‌ కార్‌ ధర 1.5 రెట్లు అధికం. ఎగ్జిక్యూటివ్‌ తరగతి అయితే ధర 1.4 రెట్లు ఎక్కువ. ఢిల్లీ నుంచి వారణాసికి ప్రయాణించే వాళ్లకి టీ, టిఫిన్, భోజనం కోసం రూ.399, చైర్‌ కార్‌‌పై రూ.344. తిరుగు ప్రయాణంలో ఎగ్జిక్యూటివ్‌‌కు రూ.349, చైర్‌ కార్‌‌కి రూ.288 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ట్రైన్ కంటే ఫ్లైట్ టికెట్ ధర తక్కువ. అంతేకాదు రైలులో అయితే 8 గంటలు ప్రయాణం, విమానంలో కేవలం గంటన్నరలోనే చేరుకోవచ్చు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *