అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారిక నివాసం వైట్‌హౌస్‌నే పేల్చివేయాలనుకున్నాడా కుర్ర ఉగ్రవాది. నిండా పాతికేళ్ళు లేవు. అయినా పవర్ ఫుల్ బాంబుతోను, ట్యాంక్ విధ్వంసక రాకెట్‌తోను వైట్‌హౌస్‌ను పేల్చివేసి తనను తాను కూడా ఆత్మాహుతి చేసుకోవాలనుకున్నాడు. కానీ 21 ఏళ్ళ హాషెల్ జలాల్ తాహెబ్ అనే ఈ సూసైడ్ బాంబర్ యత్నాలు ఫలించలేదు. జార్జియాలో ఇతడ్ని ఎఫ్ బీ ఐ అధికారులు అరెస్టు చేశారు.

తాహెబ్ లిస్టులో వైట్ హోసే కాక, ఇంకా వాషింగ్టన్ మాన్యుమెంట్, లింకన్ మెమోరియల్ వంటివి చాలా ఉన్నాయి. వైట్ హౌస్ పని పట్టాక వాటి పనీ పడదామనుకున్నాడు. కానీ ఇతని కదలికలపై నిఘా పెట్టిన ఎఫ్ బీ ఐ సిబ్బంది బుధవారం ఇతడ్ని పట్టేశారు.తన పేరు మార్చేసుకుని ఐసిస్‌లో చేరేందుకు సిరియాకో, ఇరాక్‌కో చెక్కేద్దామనుకున్నాడట. గత ఆగస్టులో ఆ దేశాలకు వెళ్లేందుకు తన కారును అమ్మకానికి పెట్టిన వైనం కూడా అధికారులకు తెలిసిపోయింది. అయితే పాస్ పోర్టు లేకపోవడంతో ట్రావెల్ చేయలేకపోయాడట. మొత్తానికి తాహెబ్ అనే ఈ ‘ చిన్న ఉగ్రవాది ‘ ఆట కట్టయింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *