ఇథియోపియా విమాన ప్రమాద ప్రభావం ఇతర దేశాల ఎయిర్ లైన్స్ విమానాల మీదా పడుతోంది. బ్రిటన్ లోని అతిపెద్ద ‘ టీ యూ ఐ ‘ ఎయిర్ లైన్స్ తమ బోయింగ్ 737 మాక్స్ ప్లేన్లను నడపరాదని నిర్ణయించింది. ఇథియోపియా విమానం కూలిపోయిన ఘటనలో అందులోని 157 మందీ మరణించిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదానికి కారణాలు ఇప్పటికీ తెలియలేదు.


గత నాలుగునెలల్లో ఇది అతి పెద్ద ప్లేన్ క్రాష్ అని, జకార్తాలో గత అక్టోబరులో లయన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం కూలి..189 మంది మృతి చెందిన విషయాన్ని మరువరాదని ఈ సదర్భంగా గుర్తు చేస్తున్నారు. బ్రిటన్ లోని టీ యూ ఐ ఎయిర్ లైన్స్ వద్ద 15 బోయింగ్ 737 విమానాలు, 8 మాక్స్ ప్లేన్స్ ఉన్నాయి. వీటి ఉత్పత్తిదారులు వీటిని నడప వచ్చా లేదా అన్నదానిపై ఎలాంటి హామీనివ్వలేదని ఎయిర్ లైన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. చైనా పౌర విమాన యాన శాఖ కూడా తమ 737 విమానాలను గ్రౌండ్ చేయాలని నిర్ణయించింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *