నాడియా బోల్జ్ వెబర్.. కొలరాడో రాజధాని డెన్వర్ లో మంచి పేరున్న ఒక ఫెమినిస్ట్. ‘పాపులకు-సన్యాసులకు కలిపి కట్టిన’ ఒక చర్చిలో ఈవిడ పాస్టర్‌గా వుంటున్నారు. ఈ వేలంటైన్స్ డే సందర్భంగా మహిళా సమాజానికి ఆమె ఒక వినూత్న సందేశం ఇవ్వాలని సంకల్పించింది. అనుకోవడమే తడవు.. తన చర్చికొచ్చిన ఆడవాళ్లందరినీ.. ‘మీ ప్యూరిటీ రింగ్స్‌ని పట్టుకొచ్చి నాకివ్వండి’ అంటూ ఆదేశించిందామె. నెలరోజుల్లో దాదాపు 170 రింగ్స్ సమకూరాయి. (పెళ్లయ్యేవరకు లైంగిక చర్యలో పాల్గొనబోను అంటూ దేవుడి ఎదుట ప్రతిజ్ఞ చేసే సమయంలో ధరించే వేలి ఉంగరాన్ని ప్యూరిటీ రింగ్‌గా వ్యవహరిస్తారు.)

ఈ పవిత్రమైన ఉంగరాలన్నిటినీ కరిగించి ఒక అరుదైన ఆకారాన్ని తయారుచేయించింది నాడియా బోల్జ్ వెబర్. ఆడవాళ్ళ మర్మావయవం పైభాగాన్ని (VULVA) పోలిన ఈ శిల్పం.. ఆవిష్కరణ కార్యక్రమం కూడా అత్యంత అట్టహాసంగా నిర్వహించింది. ఈ క్రతువును ఆమె ఒక గర్వకారణంగా చెప్పుకుంది కూడా.

రగిలే జ్వాల నుంచి పుట్టిన ఒక కిరీటం ఆకారంలో ఒదిగిన ఈ VULVA ప్రతిమ ఇప్పుడు క్రిస్టియన్ ఫెమినిస్టు ప్రపంచం మొత్తాన్ని ఆకట్టుకుంటోంది. దీన్ని అమెరికన్ మానవ హక్కుల పోరాట నేత గ్లోరియా స్టీనేమ్‌కి అంకితమిస్తూ.. ‘సగటు మహిళ ఆత్మగౌరవానికి, ఆమె చూపించే కృతజ్ఞతా భావానికి ఇది ప్రతీక’ అంటూ పొగిడేసింది కూడా. ఆమెలోని బోల్డ్‌నెస్‌కి మురిసిపోయి.. అభినందనల వర్షం కురిపిస్తోంది కేథలిక్ సొసైటీ!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *