కాలిఫోర్నియాలో కళ్ళు చెదిరే లైట్ల మధ్య అట్టహాసంగా ప్రారంభమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో వాటర్ బాటిల్స్ తో నిలబడిన ఓ చిన్నది అందర్నీఆకర్షించింది. నీలిరంగు దుస్తుల్లో చేతిలో వాటర్ బాటిళ్ళ ట్రే పట్టుకుని నిలబడిన ఈ భామ హైలైట్ గా నిలిచింది. ఈ ఫంక్షన్ కు హాజరయిన హాలీవుడ్ స్టార్స్ తీయించుకున్న ప్రతి ఫోటోలో ఈమె కనిపించడంతో..ఈమెకు ‘ ఫిజీ వాటర్ గర్ల్ ‘ అని పేరు పెట్టేశారు. పైగా ఈ అవార్డుల్లో నిజమైన విన్నర్ ఈ భామేనంటూ సోషల్ మీడియా సరదాగా కోడై కూసింది.

ఈ ఈవెంట్ కు ఫిజీ వాటర్ బాటిల్స్ సంస్థ స్పాన్సరర్ గా వ్యవహరిస్తోంది మరి ! ఈ సందర్భంగా పబ్లిసిటీ కోసం ఈ అమ్మాయిని రెడ్ కార్పెట్ పై నుంచోబెట్టారు. ఇంతకీ ఈమె ఎవరా అని ఆరా తీస్తే.. ఈమె లాస్ ఏంజిల్స్ కు చెందిన మోడల్ కెల్లెత్ కుత్ బెర్త్ అని తేలింది.

జేమీ లీ కర్టిస్, ఇడ్రిస్ ఎల్బా వంటి స్టార్స్ తో కెల్లెత్ ఫోటోలు దిగడం విశేషం. ఈమె వివరాలు తెలియజేయాలని చాలామంది కోరగా.. ఈమె మా ఫిజీ వాటర్ గర్ల్స్ కే ‘ ఉత్తమ సహాయ నటి ‘ అని ఫిజీ సంస్థ తమాషాగా వ్యాఖ్యానించింది. ఫిజి వాటర్ కు ఆమె తమ ప్రచారకర్త అని, మాకు పబ్లిసిటీ చేస్తున్న ఆమె వల్ల తమకు ఎంతో ‘ ఆదాయం ‘ వచ్చిందని ఈ సంస్థ పేర్కొంది.



Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *