శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక మొదటిసారిగా గుడిలో ప్రవేశించి చరిత్ర సృష్టించారు బిందు, కనకదుర్గ. వీరి ఆలయ ప్రవేశంతో రాష్ట్రమంతా అల్లర్లతో అట్టుడికింది, అయితే ఏది ఏమైనా తాము ఆలయ ప్రవేశం చేయాలనే నిర్ణయించుకున్నామని వీరు తెలిపారు. చాలామంది తమ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చూశారని, కానీ తమ నిర్ణయం మారలేదని కన్నూరు యూనివర్సిటీలో లా లెక్చరర్ అయిన బిందు, ఆఫీసు ఉద్యోగిని కనకదుర్గ చెప్పారు.
సుప్రీంకోర్టు తీర్పు అనంతరం వీళ్ళు డిసెంబరు 24 న ఆలయ ప్రవేశం చేసేందుకు విఫలయత్నం చేశారు. కానీ జనవరి 2 న విజయవంతంగా గుడిలో ఎంటర్ అయ్యారు. కానీ కథ ఇక్కడితో ముగియలేదు. నిరసనకారుల నుంచి వీరికి ఇంకా బెదిరింపులు అందుతూనే ఉన్నాయి. దాంతో కోచ్చీ నగర శివార్లలోనే ఇంకా అజ్ఞాతంలో ఉంటున్నారు. అయితే అధికారులు, పోలీసులు ఇస్తున్న హామీలతో త్వరలో తిరిగి తమ ఇళ్ళకు చేరుకుంటామని బిందు, కనకదుర్గ చెబుతున్నారు.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *