సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ బీజేపీ హైకమాండ్ అలర్టయ్యింది. ప్రభుత్వపరంగా మోదీ ఓ వైపు కీలక నిర్ణయాలు తీసుకుంటుండగా, పార్టీ పరంగానూ తనదైనశైలిలో మార్పులు చేయడం మొదలుపెట్టారు అధ్యక్షుడు అమిత్ షా. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన మూడు రాష్ట్రాల మాజీ సీఎంలను జాతీయ రాజకీయాల్లోకి తీసుకొచ్చింది హైకమాండ్. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎంలుగా పనిచేసిన వసుంధర రాజె, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, రమణ్‌ సింగ్‌లను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించింది.

మాజీలకు ఇది ప్రమోషన్‌గానే పార్టీలోని చాలామంది నేతలు చెబుతున్నారు. ముగ్గురు నేతల వ్యవహారశైలి వల్లే మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలైందన్నది బీజేపీ అంతర్గత విశ్లేషణ. ఎన్నికల ఫలితాల తర్వాత తాము రాష్ర్టానికే పరిమితం అవుతామని, జాతీయ రాజకీయాల్లోకి వచ్చేదిలేదని తేల్చిచెప్పేశారు నేతలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నేతలను ఆయా రాష్ర్టాల్లో కొనసాగిస్తే గ్రూపులు పెరిగి, వచ్చే ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో సీట్లను సాధించలేమని భావించిన షా టీమ్, నేతలకు ప్రమోషన్ ఇచ్చేసింది. ఈ మార్పు బీజేపీకి ఏమాత్రం కలిసొస్తుందో చూడాలి.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *