రాజధాని అమరావతి పనులను వేగవంతం చేస్తోంది ఏపీ సర్కార్. ఇందులోభాగంగా రెండు కీలకమైన ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శనివారం ఉదయం శంకుస్థాపన చేశారు. విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిని అమరావతితో అనుసంధానిస్తూ కృష్ణానదిపై నిర్మించే ఐకానిక్‌ వంతెనకు శ్రీకారం చుట్టారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం నుంచి అమరావతి వరకు కృష్ణానదిపై రూ.1387 కోట్లతో 3.2కి.మీ.ల పొడవైన ఐకానిక్‌ వంతెనను నిర్మించనున్నారు.

వంతెనకు మధ్యలో 0.48కి.మీ.ల భాగాన్ని ఐకానిక్‌గా నిర్మిస్తారు. యోగ భంగిమను పోలిన విధంగా పైలాన్‌ ఉంటుంది. వంతెనతో అనుసంధానిస్తూ రెండు పక్కలా తీగల మాదిరిగా అమరిక ఉంటుంది. రెండు వైపులా 2.5 మీటర్ల వెడల్పైన నడకదారి ఉంటుంది. ఈ వంతెనతో హైదరాబాద్‌, జగదల్‌పూర్‌ జాతీయ రహదారులు అమరావతితో అనుసంధానం అవుతాయి. దీంతో రెండు గంటల ప్రయాణ సమయం ఆదా అవ్వడమేకాకుండా విజయవాడలో ట్రాఫిక్‌ కూడా తగ్గుతుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *