ప్రపంచ ప్రతిష్టాత్మక సెల్యులాయిడ్ ఫెస్టివల్.. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం. గ్లామర్ వరల్డ్‌కి ఇదే అల్టిమేట్ డయాస్. 91 సంవత్సరాలుగా జరుగుతూ వస్తున్న ఈ పండక్కి ఈసారి కూడా కోడక్ ధియేటర్ ముస్తాబవుతోంది. ఇదిలా ఉంటే.. వచ్చే శుక్రవారం జరిగే ఆస్కార్ ఈవెంట్‌ని వాయిదా వేయాలన్న యోచన చేసింది అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెస్. కానీ.. టెలికాస్టింగ్‌కి సంబంధించిన కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు మరో ప్రకటన వెలువడింది.

అకాడెమీ ఇలా నాలిక్కర్చుకోవడం కొత్తేమీకాదు. ఇటీవలి కాలంలో నాలుగుసార్లు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని దిద్దుబాటు చర్యలకు దిగింది. రేటింగ్ పడిపోతున్న క్రమంలో వ్యూయర్లను ఎట్రాక్ట్ చేసుకోవాలన్న తాపత్రయంలో ఇటువంటి తడబాట్లకు పాల్పడుతోంది ఆస్కార్ అకాడెమీ. ABC సంస్థతో కుదిరిన టెలికాస్టింగ్ డీల్ విషయంలో అకాడెమీకి ఇక్కట్లు తప్పడం లేదు.

వాణిజ్య ప్రకటనలు, ఫైనాన్సియల్ ఒత్తిళ్ల నుంచి తప్పించుకునేందుకు నానా తంటాలు పడుతున్నట్లు స్పష్టమవుతోంది. కొత్త మ్యూజియం నిర్మాణం కోసం 388 మిలియన్ డాలర్ల సొమ్ము కావాల్సి వుంది. ఆస్కార్ ఈవెంట్ ప్రసార హక్కుల ద్వారా దాన్ని సమకూర్చుకోలేక సతమతమవుతోంది. ప్రేక్షకుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్.. ఇప్పటికీ బిగ్గెస్ట్ లైవ్ టెలివిజన్ షోగా చెలామణీ అవుతోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *