అమెరికాలోని సౌత్ హావెన్ లో గల మిచిగాన్ సరస్సు స్వరూపమే మారిపోయింది. నిన్న మొన్నటివరకు అతి శీతల వాతావరణం‌తో ఉక్కిరిబిక్కిరైన ఈ ప్రాంతంలో  మెల్లగా మళ్ళీ సాధారణ ఉష్ణోగ్రతలు ఏర్పడుతున్నాయి.
దీంతో ముఖ్యంగా సౌత్ హావెన్‌లోని మిచిగాన్ సరస్సు పైభాగమంతా ఐస్ పలకలుగా, ముక్కలు, ముక్కలుగా  గడ్డ కట్టడంతో..కిందిభాగంలో నీళ్ళు ప్రవహిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో గడ్డ కట్టిన సరస్సు పైభాగమంతా మళ్ళీ నీటితో నిండుగా కనిపిస్తుందట..
అయితే ప్రస్తుతం ఈ లేక్ విచిత్రమైన  రూపును చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రకృతి ప్రేమికులైతే ద ఫోటోల మీద ఫోటోలు తీసుకుంటూ వాటిని తమ ఫ్రెండ్స్‌కి సర్క్యులేట్ చేస్తున్నారు. అసలిది సరస్సేనా అన్న సందేహాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. పైగా సరస్సు పైభాగంలో గడ్డ కట్టిన ఐస్ కొన్ని  చోట్ల పలకలుగాను, మరికొన్ని  చోట్ల మరో రూపులోను కనిపించడం విశేషం.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *