టీఆర్ఎస్ ఎంపీలు – ప్రధాని నరేంద్రమోదీ మధ్య సరదా సరదా సంభాషణ జరిగింది. ఢిల్లీలో తనను కలిసిన టీఆర్ఎస్ ఎంపీలతో నరేంద్రమోదీ నవ్వులు పూయించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అంత పెద్ద మెజారిటీతో గెలిచినా.. తనకు ఒక్క స్వీట్ కూడా తినిపించలేదని టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నేత జితేందర్‌ రెడ్డితో ప్రధాని అన్నారు. దీనికి ఆయన బదులిస్తూ.. మళ్లీ వచ్చినప్పుడు తప్పకుండా పుల్లారెడ్డి స్వీట్లు తీసుకొస్తామని బదులిచ్చారు. హస్తినలో టీఆర్ఎస్‌ కార్యాలయానికి భూమి కేటాయించాలని టీఆర్ఎస్ రాజ్యసభ, లోక్ సభ ఎంపీలు ప్రధానినికోరిన సందర్భంలో ఈ సరదా సంభాషణ నెలకొంది. టీఆర్ఎస్‌ ఎంపీల సంఖ్య 17గా ఉందని.. అర్బన్ డెవలప్‌మెంట్ గైడ్‌లైన్స్ ప్రకారం 1000 చదరపు గజాల స్థలం ఇవ్వాలని ఈ సందర్భంగా ఎంపీలు ప్రధానికి వివరించారు. రాజేంద్రప్రసాద్ రోడ్డులో ఖాళీగా ఉన్న స్థలాన్ని టీఆర్ఎస్‌ పార్టీకి కేటాయించాలని అభ్యర్థించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *