ఇంతకాలం ఆ దంపతులు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ గోల్డ్ ఫిష్ ఇక లేదు.. ‘ జార్జ్ ‘ అన్న ఈ బంగారు చేపకు కాలం చెల్లింది. ఏజ్ మరీ ఎక్కువేం కాదు..44 ఏళ్ళు ‘ మాత్రమే ‘. కానీ అతి ‘ దీర్ఘ కాలం ‘ బతికింది. బ్రిటన్లో కీత్ ఆలీస్, అతని భార్య మేరీ.. ఎప్పుడో 1974 లో ఓ ఫన్ ఫెయిర్ లో ఈ చేపను కొన్నారు. అప్పటికే ఉన్నవాటిలోకెల్లా అత్యంత ‘ అందమైనది ‘ గా, అరుదైనదిగా ‘ జార్జ్ ‘ ..’ అవార్డు ‘ కూడా కొట్టేసింది.

ఇది ఈ నెల 12 న మరణించింది. దీంతో కీత్ దంపతుల ఇంట్లో కాస్త విషాదం అలముకుంది.42 ఏళ్ళ ఫ్రెడ్ అనే మరో గోల్డ్ ఫిష్ రెండేళ్ళ క్రితం చనిపోగా..ఆ జ్ఞాపకాలను ఇప్పటికీ వీళ్ళు తలచుకుంటున్నారు. తాజాగా జార్జ్ కూడా చనిపోవడం వాళ్లకు మింగుడు పడని విషయమే. సాధారణంగా ఇలాంటి చేపలు  తక్కువ కాలం జీవిస్తాయి . కానీ ఇది మాత్రం ఆక్వేరియం లో ఇంతకాలం అందరికీ కనువిందు చేస్తూ.. తిరిగి.. ‘ కన్ను మూసింది ‘.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *