అమెరికాలో చిన్న వయస్సులోనే మహిళా బాక్సర్‌గా రాణించి.. ఎన్నో పతకాలు సాధించిన ఫ్రీదా ఆత్మహత్య ఆ తండ్రిని కలచివేసింది. అమ్మా ! నీతో మరొక్క రోజైనా..లేదా మరొక్క సంవత్సరం గడిపినా జీవితాంతం సంతోషంగా ఉండేవాడినేమో అంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యాడు.

42 ఏళ్ళ ఫ్రీదా టెక్సాస్‌లోని హూస్టన్‌లో గల తన ఇంట్లో ఇటీవల ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు కారణం తెలియలేదు. ఈ నెల 9 న ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న 70 ఏళ్ళ ఆమె తండ్రి జార్జ్ ఫోర్మన్.. బాక్సింగ్ లో రాణించే ముందు బాగా  చదువుకోవాలని తన కూతురికి చెప్పేవాడినని ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.

ఈయన కూడా హెవీ వెయిట్ బాక్సర్, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ కూడా ! 2001 లో ఫ్రీదా తన బాక్సింగ్ కెరీర్ ను ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగింది. పెద్దగా చదువు అబ్బకపోయినా .. ఈ రంగంలో చాలా పాపులర్ అయింది. ఈమెకు భర్త, కూతురు ఉన్నారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *