దేవుళ్లను సృష్టించింది చంద్రబాబా. ! మరీ విడ్డూరంగా లేదూ.. సైబరాబాద్ ను నేనే నిర్మించానని.. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నిలిపింది నేనే.. అని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పుకోవడం పలు సందర్భాల్లో చూశాం. అయితే, సాక్షాత్తూ భగవంతుడ్ని తానే సృష్టించానని చంద్రబాబు ఏ సందర్భంలోనూ అన్న దాఖలాలు లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత.. ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం దేవుళ్లను సృష్టించింది తానేనని చంద్రబాబు భ్రమిస్తాడంటున్నారు. చంద్రబాబు నాయుడు దేవుళ్లను నమ్మడు, వాళ్లను సృష్టించింది తానేనని భ్రమిస్తాడు. తన ఫొటోకు తానే మొక్కుకుంటాడు. ప్రజలకు నిన్నటి విషయాలేవి గుర్తు రాకుండా చేయమని వేడుకుంటాడు. అంటూ తన ట్విట్టర్ అకౌంట్ లో చమత్కారాలు సంధించారు.

తనను ఇబ్బంది పెట్టేందుకే ఎన్నికలను తొలి దశలో పెట్టారని చంద్రబాబు కన్నీళ్లు కారుస్తున్నాడు. కానీ తెలంగాణ, ఏపీల్లో ఒకే రోజు పోలింగ్ జరగడమే ఆయన బాధకు అసలు కారణం అంటూ వ్యాఖ్యానించారు. వేర్వేరు తేదీల్లో ఎన్నికలు జరిగితే 2014 మాదిరిగా తెలంగాణ నుంచి పది లక్షల మందిని రప్పించి గెలవొచ్చన్నది చంద్రబాబు ప్లాన్ అంటూ మరో కహానీ వినిపించారు విజయసాయి. ‘పప్పు కోసం మంగళగిరిని ఎప్పుడో డిసైడ్ చేశాడు తుప్పు. ఎక్కడి నుంచైనా గెలుస్తాడనే బిల్డప్ ఇచ్చేందుకు కుల మీడియా ద్వారా ఇంకో నాలుగు పేర్లు చెప్పించాడు. మంత్రిగా పది మార్కులు రాని పప్పుకు మంగళగిరి ప్రజలు జీవితాంతం గుర్తుండేలా వాతలు పెట్టి, పచ్చబొట్లు పొడిచి వదులుతారు’ అంటూ అటు లోకేష్ నీ టార్గెట్ చేశారు విజయసాయిరెడ్డి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *