గూగుల్ + సోషల్ మీడియా సర్వీసు పెద్ద పొరబాటు చేసి అపఖ్యాతి మూట గట్టుకుంది. గత నెలలో లక్షలాది  కస్టమర్ల పర్సనల్ డేటాను ‘ బహిర్గతం ‘ చేసి ‘ వార్తల్లో ‘ కెక్కింది. ఇది గూగుల్ + లోని సాఫ్ట్ వేర్ బగ్ నిర్వాకమేనని గూగుల్ కూడా అంగీకరించింది. తమ వ్యక్తిగత వివరాలు వెల్లడి అయినవారిలో అనేకమంది బిజినెస్ బాబులు కూడా ఉన్నారు. ఈ బగ్ ని ప్రవేశపెట్టిన ఆరు రోజుల్లోనే ఇలా జరిగిందట. దీంతో.. నాలుగు నెలలు ముందుగానే..అంటే వచ్చే ఏప్రిల్ లోగానే గూగుల్ + ని మూసివేస్తామని ఈ సంస్థ ప్రకటించింది. ఈ బగ్ వల్ల ‘ నష్టపోయిన ‘ కస్టమర్ల వివరాలను నోటిఫై చేసే ప్రక్రియ ప్రారంభమైందని గూగుల్ వెల్లడించింది. గూగుల్ + డేటా యాక్సెస్ విషయంలో డెవలపర్స్ వినియోగించే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ప్రోగ్రామ్స్ ని 90 రోజుల్లోగా నిలిపి వేస్తామని ప్రొడక్షన్ మేనేజ్ మెంట్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ థాకర్ తెలిపారు.  డేటా ప్రాక్టీసులపై ఈ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ యూఎస్ కాంగ్రెస్ కు చెందిన  హౌస్ జుడిషియరీ కమిటీ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి ఒకరోజు ముందు జరిగింది ఈ వైనం. ఏమైనా.. తమ పర్సనల్ డేటా ఇలా బయటపడిపోవడం కస్టమర్లలో ఆందోళన కలిగిస్తోంది.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *