ఈనెల 29 రిలీజ్ కాబోతోన్న రామ్‌గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా రిలీజ్ కు మార్గం సుగమం అయింది. ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు మంగళవారం తన తీర్పును వెల్లడించింది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలను ఆపటం కుదరదని.. భావ స్వేచ్ఛ విషయంలో తాము కలగజేసుకోలేమని’ న్యాయస్థానం పేర్కొంది. లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలగకుండా పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటారని అడ్వకేట్ జనరల్ కోర్టుకు ఈ సందర్భంగా విన్నవించారు. అనంతరం సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసింది.

ఇలా ఉండగా, ఎన్నికల తేదీ దగ్గరపడుతుండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా రోడ్ షోలతో విస్తృత పర్యటనలు చేస్తుంటే, జగన్ కు చేదోడుగా ఇప్పుడు తల్లి విజయలక్ష్మి, చెల్లెలు షర్మిల కూడా రెడీ అవుతున్నారు. వీరిద్దరి ప్రచారంకోసం ప్రత్యేక బస్సులు కూడా సిద్ధం చేస్తున్నారు. 27న మంగళగిరి నుంచి షర్మిల ప్రచారం ఉంటుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 10 జిల్లాల్లోని 50 నియోజకవర్గాల్లో షర్మిల ప్రచారం నిర్వహిస్తారని తెలుస్తోంది. మరో వైపు, విజయమ్మ ఏపీలోని 40 నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *