గుంటూరు జిల్లాలో కోటయ్య అనే రైతు మృతి వివాదానికి దారితీసింది. పోలీసులు కొట్టడం వల్లే ఆయన చనిపోయాడని వైసీపీ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు రియాక్ట్ అయ్యారు. దీనిపై గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్‌బాబు మండిపడ్డారు. పోలీసులపై జరుగుతున్న విష ప్రచారాన్ని ఆపాలన్నారు. సీఎం హెలీప్యాడ్‌ ఏర్పాటు చేసిన ప్రాంతానికి- కోటయ్య పొలానికి అసలు సంబంధమే లేదన్నారు. జరిగిన విషయాలను ఆధారాలతో సహా మీడియాకి వివరించారు. సీఎం చంద్రబాబు పాల్గొన్న కొండవీడు వేడుకల సందర్భంగా ఓ రైతును పోలీసులే కొట్టి చంపారనే ప్రచారంపై సాగింది. కోటయ్యకు 14 ఎకరాల స్థలం ఉందని, అది కొండవీడు వేడుక జరిగే ప్రాంతానికి దూరంగా వుందన్నారు. అందులో మూడు నుంచి నాలుగెకరాల ఖాళీ స్థలంలో అనుమతులు తీసుకొని పోలీసు కంట్రోల్‌రూం ఏర్పాటు చేశామని, ఈ స్థలానికి దూరంగా బొప్పాయి, కనకాంబరం, మునగ తోటలున్నాయని తెలిపారు.

సోమవారం ఉదయం పదింటికి రైతు కోటేశ్వరరావు పురుగుల మందు తాగినట్టు గస్తీ పోలీసులకు సమాచారం వచ్చిందని, ఆయన ప్రాణాలు కాపాడాలనే ఆతృతతో ఓ కానిస్టేబుల్‌ కోటేశ్వరరావును భుజంపై వేసుకొని దాదాపు 700 మీటర్లు పరుగు తీశారని వివరించారు. ఈ క్రమంలో విద్యుత్‌ శాఖకు చెందిన వాహనంలో ఆసుపత్రికి తరలించారని, అప్పటికే ఆ రైతు మృతి చెందాడన్నారు. ఈ ఘటన.. సీఎం టూర్‌కు దాదాపు నాలుగుగంటల ముందు చోటు చేసుకుందన్నారు. ఈ క్రమంలో కనకాంబంరం తోటలో కొద్ది మొక్కలను తొక్కి ఉండవచ్చని, తోట మొత్తం పాడు జేశారనడం చెప్పడం సరికాదన్నారు. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు సాగుతోందని, నిజానిజాలు తేలుతాయని చెబుతున్నారు పోలీసులు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *