ఆ తాతా మనవళ్ళ ఏడుపు సీన్ చూసి అందరి కళ్ళూ ‘ చెమర్చాయి ‘.’ హృదయాలు బరువెక్కాయి ‘. లేటెస్ట్ కన్నడ పొలిటికల్ డ్రామాకు ఈ తాతా మనవళ్ళు తెర తీసిన విధంబెట్టిదనిన.. అది కర్నాటకలోని హసన్ లోక్ సభ నియోజకవర్గం. బుధవారం తన మనవడు ప్రజ్వల్ రేవన్న తో కలిసి జేడీ-ఎస్ చీఫ్, మాజీ ప్రధాని దేవెగౌడ ప్రసంగిస్తున్న వేళ..ఈ సభలో మాట్లాడుతూ..మాట్లాడుతూ ఆయన ఎందుకో ఒక్కసారిగా ఎమోషనల్ గా ఫీలై కంటతడి పెట్టారు. (ఈ నియోజకవర్గానికి ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరి!) ఈ సీటును తాను వదులుకుంటున్నాననో..లేక తన ముద్దుల మనవడికి ‘ ఇచ్చేస్తున్నాననో ‘..దేవెగౌడ భావోద్వేగానికి గురయ్యారు.

అంతే ! ఆయన కళ్ళు తుడుచుకోవడం చూసి ప్రజ్వల్ కూడా తన కన్నీటిని ఆపుకోలేకపోయాడు. ఆయనను పక్కనున్న మద్దతుదారులు అనునయించాల్సి వచ్చింది. స్థానిక టీవీ చానల్స్ ఈ ‘ డ్రామాను ‘ విస్తృతంగా హైలైట్ చేశాయి. ‘ అయితే 2019 ఎన్నికలకు ఫస్ట్ డ్రామా ఇప్పుడు మొదలైంది ‘ అని బీజేపీ దీనిపై ట్విటర్ లో సెటైర్లు వేసింది. ఆ మధ్య సిఎం కుమారస్వామి కూడా ప్రెస్ మీట్లో తన ఏడుపు సీన్ తో ‘ పాపులర్ ‘ అయ్యారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *