అమెరికాలోని టెక్సాస్ లో ఓ స్టార్టప్ ఓనర్..తను డాక్టర్ కాకున్నా.. అలాగే పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు. ముసలితనం రాకుండా నివారించేందుకు, మళ్ళీ యువకుల్లా కనిపించేందుకు తను ఓ ‘ చిట్కా ‘ కనిపెట్టాడట. అదే..నూనూగు మీసాల యువకుల రక్తంలోని ప్లాస్మాను సేకరించి దాన్ని వృద్ధాప్య దశలో ఉన్నవారికి ట్రాన్స్ ఫ్యూజ్ చేస్తాడట. జెస్సీ కర్మాజిన్ అనే 34 ఏళ్ళ ఇతగాడు ‘ యాంబ్రోసియా ‘ పేరిట ఓ స్టార్టప్ స్టార్ట్ చేసి డబ్బులు బాగానే దండుకుంటున్నాడు. తమ ప్లాస్మా ఇచ్చేందుకు డోనర్లు, డాన్ని తమ రక్తంలోకి ఎక్కించుకుని యువకుల్లా కనబడడానికి మధ్యవయస్కులు, వృద్ధులు సైతం ఇతని కార్యాలయం ముందు బారులు తీరుతున్నారు. మనిషికి 8 వేల డాలర్ల ఫీజు తీసుకుని కర్మాజిన్ తన ‘ వ్యాపారాన్ని ‘ బాగానే కొనసాగిస్తున్నాడు.

తను ఇస్తున్న ట్రీట్ మెంట్ మంచి ఫలితాలనిస్తోందని, ఇది వ్యక్తుల అపియరెన్స్ ను మెరుగుపరచడమే కాక, వారి మెమొరీని, స్త్రెంత్ ను పెంపొందిస్తుందని చెబుతున్నాడు. ‘దీనివల్ల వీరు శాశ్వతంగా మృత్యువుకు దూరమవుతారని చెప్పలేనని, కానీ వీళ్ళు మాంచి యంగ్ గా, ఎనర్జిటిక్ గా, ఆరోగ్యంగా కనిపిస్తారని ‘ అంటున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ‘ ఇన్ సైడ్ ప్లాస్టిక్ సర్జరీ ‘ లాంటిదే అని సెలవిస్తున్నాడు. ఇతని ఫ్రీ పబ్లిసిటీ మాత్రం చాలామందిని ఆకర్షిస్తోంది. 16 నుంచి 25 ఏళ్ళ మధ్య వయస్సు డోనర్లు ఇచ్చిన ప్లాస్మాతో వందమందికి పైగా ట్రీట్ మెంట్ పొందారట. తన చికిత్సా విధానం సక్సెస్ అని కర్మాజిన్ డబ్బా కొట్టుకుంటుండగా, ఇతనిదంతా బోగస్ అని సైంటిస్టులు కొట్టిపారేస్తున్నారు. ప్లాస్మాను ఎక్కించుకున్నవారికి ఇది నిజంగా దోహదపడిందా అనడానికి ఆధారాలు లేవని వాళ్ళు పెదవి విరిచారు. పైగా ఈ ట్రీట్ మెంట్ ఎన్నో లోపాలతో కూడుకున్నదని, ఇతర ఆరోగ్యసమస్యలు కూడా తలెత్తుతాయని వాళ్ళు ఆరోపించారు.

కర్మాజిన్ ఆధ్వర్యంలో పని చేసిన ఓ డాక్టర్ అన్-ప్రొఫెషనల్ అని టెక్సాస్ మెడికల్ బోర్డు ప్రకటించింది. ఏ రాష్ట్రంలోనూ కర్మాజిన్ మెడిసిన్ ప్రాక్టీసు చేసిన దాఖలాల్లేవని పేర్కొంది. ఇంతేకాదు.యాంబ్రోసియా ప్రెసిడెంట్, కర్మాజీ వద్ద చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా పని చేసిన వ్యక్తి ఇటీవలే ఈ సంస్థ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. కర్మాజిన్ మెడికల్ క్యాంప్ లో చికిత్స పొందిన వ్యక్తి 65 ఏళ్ళ వయస్సులో గుండెపోటుతో మరణించాడు. అయితే తన ట్రీట్‌మెంట్ పొందిన, లేదా పొందుతున్న వారిలో ఎవరూ మృతి చెందలేదని, సదరు వ్యక్తి మరణించాడంటే అందుకు ఇతర కారణాలు ఉండవచ్చునని కర్మాజిన్ అంటున్నాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *