గుండె జబ్బులతో బాధ పడుతున్న రోగుల విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని పరిశోధకులు మండిపడుతున్నారు. దాదాపు 20 ఏళ్ళు గడిచినా.. గుండె జబ్బుల నివారణలో సర్కార్లు విఫలమయ్యాయని వీరు దుయ్యబడుతున్నారు. ఓ హార్ట్ పేషంటుకు గుండె నొప్పి వస్తే దాన్ని ఆస్త్మా గానో, లేదా వృద్ధాప్యం వల్ల వచ్చిన రుగ్మతగానో పొరబాటు పడుతున్నారని, క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధుల చికిత్సలో ఎన్నో ఆధునిక విధానాలను పాటిస్తున్నప్పటికీ, హార్ట్ పేషంట్ల పట్ల ఇలా మెరుగైన చికిత్సా విధానాలను ఎందుకు పాటించ లేక పోతున్నామని ఆక్స్‌ఫర్డ్, బర్మింగ్‌హాం యూనివర్సిటీల రీసెర్చర్లు ప్రశ్నిస్తున్నారు.

 

ఒక్క బ్రిటన్‌లోనే సుమారు 9 లక్షల 20 వేలమంది గుండె సంబంధ రుగ్మతలతో బాధ పడుతున్నారని వీరు అంచనా వేశారు. ఏడాది కాలంలోనే 21 శాతం మంది హార్ట్ ఫెయిల్యూర్ కేసులతో మృత్యువుకు చేరువగా ఉన్నారని గుర్తించామని, అయితే దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం ఇది 26 శాతం ఉండేదని వీరు పేర్కొన్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉండగా.. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.

2000-2017 మధ్య కాలంలో సుమారు 56 వేలమంది గుండె జబ్బు రోగుల డేటాను పరీక్షించగా .. కేవలం స్వల్ప మెరుగుదల మాత్రమే కనిపించింది. ప్రభుత్వం తన ప్రాదాన్యతల జాబితాలో ఈ విషయానికి అసలు ప్రయారిటీ కల్పించ లేదు . ఈ పేషంట్ల చికిత్సకు తగినన్ని నిధులను మంజూరు చేయలేదు అని ఈ పరిశోధకులు తమ నివేదికలో ఆక్షే పించారు. క్యాన్సర్ లాంటి వ్యాధులకు గురైన వారిలో చాలామంది మెరుగైన చికిత్సల ఫలితంగా మళ్ళీ ఆరోగ్యవంతులయ్యారని, మరి గుండె జబ్బు రోగుల మాటేమిటని ఈ రిపోర్టులో ప్రశ్నించారు. ఇప్పటికైనా సర్కార్ మేల్కొని, ఈ అంశానికి ప్రాధాన్య మివ్వాలని వీళ్ళు కోరుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *