హీరో గోపీచంద్ మళ్ళీ యాక్టివ్ అయ్యాడు. డైరెక్టర్ సంపత్ నందితో తిరిగి చేతులు కలపబోతున్నాడు. గత ఏడాది వీరి కాంబోలో  ‘గౌతమ్ నంద’  చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సోసో‌గా  ఆడినా.. వీళ్ళ  ‘మైత్రి’  మాత్రం చెక్కుచెదర లేదట. గోపీ ఈ సారి ఎక్స్ పెరిమెంట్ బేస్డ్ సినిమా కాక. హిట్ ఫార్ములా మూవీ కోసం పట్టుబడుతున్నాడు. అందుకే మళ్ళీ సంపత్‌ని అప్రోచ్ అయ్యాడని, సంపత్ చెప్పిన స్టోరీ ఆయనకు ఎంతో నచ్చిందని టాక్.. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని అంటున్నారు. గౌతమ్ నంద చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన రాధామోహన్ ఈ తాజా ప్రాజెక్టుకు కూడా ప్రొడ్యూసర్ అట.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *