ఇంతకీ కిషోర్ ఏం చేశాడు?

నిఖిల్ హీరోగా రానున్న మూవీ ‘ముద్ర’. దీనికి సంబంధించి ఓ పిక్‌ని అభిమానులతో షేర్ చేసింది యూనిట్. వెన్నెల కిషోర్ అండ్ టీమ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న స్టిల్ అది. సమయం, సందర్భం ఏంటన్నది కాసేపు పక్కనబెడితే.. అందరూ కిషోర్‌ వైపు వేలు పెట్టి చూపుతున్నారు. కిషోర్ ఫోన్ పట్టుకోగా, అతడి ముందు నిఖిల్.. నటి ప్రగతి చేతులు చూపిస్తున్నారు. కిషోర్ పక్కన కమెడియన్ విద్యురామన్ కూడా ఉంది.

ఈ లెక్కన కిషోర్ ఏదో తప్పు చేస్తే.. అందరూ అతడ్ని నిందిస్తున్నట్లుగా వుంది. ‘ముద్ర సెట్స్‌లో నన్ను నిందిస్తున్నారు’ అని కామెంట్ పెట్టాడు కిషోర్. మూవీ విషయానికొస్తే.. సెట్స్‌పైకి వెళ్లకముందే భారీ ధరకు  శాటిలైట్ రైట్స్ పలకడం కొనమెరుపు. స్టార్ మా.. తెలుగు, హిందీ రైట్స్‌ని ఐదుకోట్లకు దక్కించుకుంది. నిఖిల్ కెరీర్‌లో సినిమా సెట్స్‌పైకి వెళ్లకముందే ఈ రేంజ్‌లో రేటు రావడమనేది ఇదే ఫస్ట్ టైమ్. సంతోష్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మాత.