ఏపీ సీఎం చంద్రబాబు అన్నా, ఏపీ ప్రజలన్నా, ప్రధాని మోదీకి భయమని, ఇకపై ఆయన ఏపీకి రావాలంటే భయపడే పరిస్థితి ఉందని అన్నారు హోదా సాధన సమితి నేత, సినీ నటుడు శివాజీ.. చంద్రబాబు ఆధ్వర్యాన మంగళవారం ఢిల్లీలో ఓ బృందం రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్ ను కలిసి వినతిపత్రం సమర్పించి వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడిన శివాజీ.. రాష్ట్రపతితో తమ భేటీ సుమారు 20 నిముషాలసేపు జరిగిందని, తమ సమస్యను ఆయన సావధానంగా ఆలకించారని తెలిపారు. ఈ దేశ వ్యవస్థలన్నీ మోదీ చేతిలోనే ఉన్నాయని, దీనికి విరుగుడు ప్రజాక్షేత్రమేనన్నారు. టీడీపీ నేతృత్వాన ఇక్కడ జరిగిన ధర్మ పోరాట దీక్షను దేశ ప్రజలంతా గమనించారని, ఏపీకి జరిగిన అన్యాయాన్ని గుర్తించారని ఆయన చెప్పారు. కేంద్రం మెడలు వంచి అయినా హోదా సాధిస్తామన్నారు. హోదా కోసం జరిగిన పోరాటంలో వైసీపీ, జనసేన చేతులు కలపకుండా వ్యూహాత్మక తప్పిదం చేశాయని శివాజీ ఆరోపించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *