సీఎం కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో మండిపడ్డారు నటుడు శివాజీ. ఏపీపై కుట్ర రాజకీయాలు ఎవరి కోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి వచ్చి ధైర్యంగా పోటీ చేయండి, నేరుగా మీకు నచ్చిన పార్టీకి మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రాకి చెందిన బిజినెస్‌మేన్లు, ఫిల్మ్ ఇండస్ర్టీకి చెందిన కొందరి వ్యక్తులను ఎందుకు బెదిరిస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను బలిపశువులను చేయవద్దని హితవు పలికారు. హైదరాబాద్‌లో35 లక్షల మంది ఆంధ్రులున్నారని, వీళ్లలో కొన్ని లక్షల మంది ఏపీకి తిరిగి వచ్చినా, హైదరాబాద్ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు.

పోలవరం ప్రాజెక్టుపై మొన్నటికి మొన్న సుప్రీంకోర్టులో కేసు వేయడంపై మండిపడ్డారు శివాజీ. ఏపీ ప్రజలపై మీకు అంత కసి ఉంటే ఫ్యాక్షనిస్టులతో మాట్లాడుకుని, అవసరం లేని వ్యక్తులను చంపేయండని చెప్పారు. ఏపీకి డబ్బు పంపించవద్దని ఆర్బీఐ లెటర్ రాసినట్టు తెలుస్తోందన్నారు. శుక్రవారం ఉదయం గుంటూరులో ఏపీ ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసిన శివాజీ.. రాష్ర్టంలో జరుగుతున్న ఐటీ, జీఎస్టీ దాడులపై ఫిర్యాదు చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *