వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు చదవులేక రాజకీయాల్లో అతి పెద్ద తప్పులు చేస్తున్నారన్నారు ఏపీ ప్రత్యేకహోదా ఉద్యమనేత, ప్రముఖ నటులు శివాజీ. ప్రశాంత్ కిషోర్ ను తమ పార్టీ వ్యాహకర్తగా జగన్ అభివర్ణించడం అతి పెద్ద తప్పని శివాజీ అన్నారు. జగన్ నుంచి ఏపీ ప్రజల డేటా సంపాదించిన పీకే.. సదరు డేటాను విదేశీయుల చేతుల్లో పెడుతున్నారని చెప్పారు. డేటాను అమ్ముకోవడమే పీకే బిజినెస్ అని.. పీకేను నమ్మడం జగన్ చేసిన అతి పెద్ద తప్పని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు వస్తున్న చాలా వరకూ సర్వేలు వ్యాపారంగా మారిపోయాయన్నారు. జగన్ పార్టీ మీద బీజేపీ, టీఆర్ఎస్ పెత్తనం చేస్తున్నాయన్న శివాజీ.. జగన్‌ను గెలిపించి ఏపీని గుప్పిట్లో పెట్టుకోవాలని వాళ్లు చూస్తున్నారని శివాజీ చెప్పుకొచ్చారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *