తక్కువ సినిమాలతో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఎప్పుడూ పూర్తి ఎనర్జిటిక్ గా కనిపించే విజయ్ ఆస్పత్రి పాలయ్యాడు. విరామం లేకుండా షూటింగ్‌లో పాల్గొనడంతోనే అనారోగ్యానికి గురైనట్టు విజయ్ వెల్లడించారు. ‘హోలీ పండుగ చాలా మంచిగ జరుపుకొన్నాననని.. బుధవారం తెల్లవారుజామున ఆరు గంటల వరకూ షూటింగ్‌లోనే ఉండటంతో. తనకు జ్వరం వచ్చిందని వెల్లడించాడు. అయితే, షూటింగ్ ఉండటంతో త్వరగా కోలుకోవాల్సి ఉందని అందుకే ఆస్పత్రిలో జాయిన్ అయ్యానని యంగ్ హీరో చెప్పుకొచ్చాడు. భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా ‘డియర్ కామ్రేడ్’. తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ నాలుగు భాషల్లో తెరకెక్కుతోంది. మే 31న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తు్న్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *