అసలే మోదీ హయాంలో చివరి సమావేశాలు. వాడీవేడిగా జరుగుతున్నాయి. ఈలోగా పార్లమెంట్ వెలుపల అలజడి. ఒక్కసారిగా సెక్యూరిటీ మొత్తం అప్రమత్తమైంది. లోపలున్న సభ్యులకు అలారం సిగ్నల్స్ వెళ్లిపోయాయి. ఇంతకీ అక్కడ ఏమైట్లు? ఒక అనుమానాస్పద కారు అనుమతి లేకుండా పార్లమెంట్ ఆవరణ లోపలికి దూసుకొచ్చింది. భద్రతా సిబ్బంది వారిస్తున్నా వినకుండా వేగంగా లోపలికెళ్లిన ఆ కారు మీద తుపాకులు కూడా ఎక్కుపెట్టారు.  కానీ.. తేరుకుని చూస్తే.. అదొక ఎంపీ కారు. డీఎల్ 12 సీహెచ్ 4897 (మణిపూర్) రిజిస్ట్రేషన్‌తో కూడిన ఈ కారు.. ఇన్-గేట్ నుంచి కాకుండా.. అవుట్-గేట్ ద్వారా రావడంతో గడబిడ షురూ అయింది.

జరిగింది పొరబాటేనని సదరు డ్రైవర్ ఒప్పుకున్నప్పయికీ ప్రాధమిక దర్యాప్తు కోసం అదుపులోకి తీసుకున్నారు. మూడంచెల సెక్యూరిటీని దాటుకునిమరీ అవుట్-గేట్ దాకా కారు ఎలా వెళ్లిందన్న కోణంలో ఆరా తీస్తున్నారు. మొత్తమ్మీద ఒక ఒక హైరానా అయితే అలా ముగిసిపోయింది. పౌరసత్వ బిల్లు మీద ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మణిపూర్ కారు పార్లమెంట్ దగ్గర అలజడి సృష్టించడంపై అనుమానాలు ఏర్పడ్డాయి.  బారికేడ్లను విరగ్గొట్టుకునిమరీ దూసుకొచ్చిన ఈ కారు  సహజంగానే సెక్యూరిటీ వర్గాల్లో ఆందోళన కలిగించింది. ప్రస్తుతానికి ఢిల్లీలో హైఅలర్ట్ నడుస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *