హిందూపురం వైసీపీ లోక్‌సభ అభ్యర్థి గోరంట్ల మాధవ్ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ నుంచి
ఆయనను ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించారు జగన్. ఐతే, మాధవ్ భార్య సవితకు బీఫామ్ ఇవ్వాలని ఆలోచన చేస్తోంది వైసీపీ హైకమాండ్. సోమవారం సవిత ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆమెకి బీఫామ్ ఇవ్వాలని ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలను ఆదేశించారట జగన్.

మాధవ్‌కు ప్రభుత్వం నుంచి ఇంకా రిలీవింగ్ ఆర్డర్స్ అందలేదు. శని, ఆదివారాలు ప్రభుత్వ ఆఫీసులు సెలవు రావడంతో నామినేషన్లకు సోమవారం ఒక్కరోజు మాత్రమే మిగిలివుంది! అప్పటిలోగా రిలీవింగ్ లెటర్ రాకపోతే ఆయన నామినేషన్ వేయడానికి అనర్హుడు అవుతాడు. దీంతో మాధవ్ భార్య సవితను బరిలోకి దించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముందు జాగ్రత్తగా ఆమెకి బీఫామ్ ఇవ్వనున్నారు జగన్. తన వీఆర్ఎస్‌ను ఆమోదించాలని ట్రైబ్యునల్ ఆదేశించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి నిర్ణయం రాలేదని అంటున్నారు మాధవ్.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *