‘ గీతాంజలి ‘. ‘ త్రిపుర ‘ వంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ కు దర్శకత్వం వహించిన రాజా కిరణ్ మరో హారర్, థ్రిల్లర్ చిత్రానికి మెగా ఫోన్ పట్టాడు. నందితారాజ్, సత్యం రాజేష్, ఆశుతోష్రాణా ప్రధాన తారాగణంగా ‘ విశ్వామిత్ర ‘ అనే టైటిల్ తో సినిమా తీస్తున్నాడు. ఈ విశ్వంలో పురుషులు కొద్ది కాలం మాత్రమే బతుకుతారన్న కాన్సెప్ట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టు తెలిపాడు.

అమెరికా, న్యూజిలాండ్ లలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశామని, ఇందులో నందిత మిడిల్ క్లాస్ అమ్మాయిగా నటించిందని చెప్పాడు. షూటింగ్ దాదాపు పూర్తయిందని, మార్చి 21 న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని ఆయన పేర్కొన్నాడు. మాధవి అద్దంకి, ఎస్.రజనీకాంత్ సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *