మసక చీకట్లోనో, దట్టమైన చీకట్లోనో అత్యవసరంగా సెల్ తీయాల్సి వస్తేనో, కనబడని వస్తువును చూడాలనుకుని సెల్ ని ఓపెన్ చేస్తేనో బ్లూ (నీలి) రంగు బయటపడుతుంది. అలాగే టీవీ, లేదా కంప్యూటర్ స్క్రీన్ మీద కూడా ఇలాంటిది సహజమే. అయితే ఈ సాధనాల నుంచి వెలువడే నీలిరంగు హానికరమని, మన చర్మానికి, దృష్టికి కూడా డేంజరేనని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

వ్యక్తులు తాము నిద్ర పోబోయే ముందు ఈ డివైజ్ లను తప్పనిసరిగా ఆఫ్ చేయాలని సూచిస్తున్నారు. అయితే ఇంకా తమ పరిశోధనలు కొనసాగుతున్నాయని, ఈ బ్లూ లైట్ హై ఎనర్జీ విజిబుల్ లైట్ అని కూడా కనుగొన్నామని డేమ్ శాలీ డెవిస్ అనే నేత్ర వైద్య నిపుణురాలు తెలిపారు. అమెరికా శాస్త్రజ్ఞులు కూడా ఈమెతో ఏకీభవిస్తూ, కంప్యూటర్, టాబ్లెట్, ఫోన్ వంటి సాధనాల నుంచి వెలువడే నీలిరంగు కంటి దృష్టికి చేటేనని స్పష్టం చేశారు. ఎక్కువసేపు వీటిని చూస్తే.. అది అంధత్వానికి దారి తీయవచ్చునని, కళ్ళలోని అతి చిన్న పరమాణువుల మీద, రెటీనా మీద తీవ్ర ప్రభావం చూపవచ్చునని టోలెడో యూనివర్సిటీ రీసెర్చర్లు వెల్లడించారు. కానీ గ్రీన్, ఎల్లో, రెడ్ లైట్ వంటి ఇతర రంగులు మాత్రం హానికరం కాదని భావిస్తున్నామన్నారు.

అజిత్ కరుణరత్నే , రోమేష్ అంగునవాలా వంటి ఇతర నేత్ర వైద్య నిపుణులు, సర్జన్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డిజిటల్ సాధనాల నుంచి వచ్చే నీలి రంగు రెటీనాకు, ప్రధానంగా కంటి మధ్య భాగంలోని మాక్యులా కు ఎక్కువ శక్తిని కాంటాక్ట్ చేసి తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా కంప్యూటర్, టీవీ తదితర సాధనాలనుంచి వెలువడే నీలిరంగు పట్ల ‘ అలర్ట్ ‘ గా ఉండాలని వీరు సూచిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *