మూడు పెద్ద రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ గెలుపు దిశగా సాగుతుండగా.. ఈ పార్టీ అధినేతలు సోనియా, రాహుల్ ఇంకా ఆచితూచి స్పందిస్తున్నారు. తమకు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలను అందుకుంటూనే.. ‘ తుది ఫలితాల కోసం వేచి చూద్దాం ‘ అని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రిజల్ట్స్ ప్రభావం 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలపై ఉంటుందా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు.

ప్రధాని మోదీ పాలనకు తాజా ఫలితాలను రెఫరెండం గా భావించవచ్చా అన్న ప్రశ్నకు కూడా రాహుల్.. అప్పుడే తొందరెందుకు ? ఫైనల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేద్దాం అని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఇంతకు మించి తానేమీ వ్యాఖ్యానించలేనన్నారు. అటు-పార్టీని విజయావకాశాల వైపు నడిపించిన క్రెడిట్ రాహుల్ దే నని సోనియా అన్నారు. బాగా కష్ట పడ్డాడు అని కితాబునిచ్చారు. కాంగ్రెస్ నేతలు, ఎంపీలు, ఎన్డీయే నుంచి తాజాగా వైదొలగిన బీహార్ బీజేపీ నేత ఉపేంద్ర కుష్వాహా ఈ తల్లీ కొడుకులకు కంగ్రాట్స్ చెప్పారు. మిజోరం, తెలంగాణా రాష్ట్రాల్లో కాంగ్రెస్ చతికిలబడగా.. ముఖ్యంగా తెలంగాణాలో తెరాస ఘన విజయం సాధించింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *