పిల్లలకు స్వేచ్చ ఇస్తేనే పెద్దలకు మేలంటున్నారు చైల్డ్ సైకాలజిస్టులు. వారిని తమ చెప్పు చేతల్లో (కంట్రోల్ లో) ఉంచుకోవాలని భావిస్తే అది తలిదండ్రులకే నెగెటివ్ ఫలితాలనిస్తుందని హెచ్చరిస్తున్నారు. అమెరికాలో అనేకమంది పేరెంట్స్ ను, పిల్లలను, కాలేజీ విద్యార్థులను స్టడీ చేసిన వీరు..  ‘పవర్ ఆఫ్ కంట్రోల్’  అన్న విషయానికి గల ప్రాధాన్యాన్ని గుర్తించాలని కోరుతున్నారు. తమ కెరీర్లమీద పిల్లలు సొంత నిర్ణయాలు తీసుకునేలా చూడండి.. వారిలో మార్పును మీరే చూస్తారు.. సెల్ఫ్-మోటివేషన్, సెల్ఫ్ గోల్, అటానమీవంటివి వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి అని వారు విశ్లేషించారు.

ఎంతసేపూ పేరెంట్స్.. తమ అభిప్రాయాలను, నిర్ణయాలను పిల్లల మీద రుద్దితే.. వాళ్ళు స్వతంత్రంగా ఆలోచించే శక్తిని కోల్పోతారని,  పైగా ప్రతి విషయానికీ తలిదండ్రుల మీదే ఆధారపడే పరిస్థితి తలెత్తుతుందని, దీనివల్ల మేలు కన్నా కీడే జరుగుతుందని ముఖ్యంగా పిల్లల మానసిక పరిస్థితులను అంచనా వేసే ఈ నిపుణులు పేర్కొంటున్నారు.మొదట్లో విద్యలో వెనుకబడిన విద్యార్థులు.. ఆ తరువాత సెల్ఫ్ గోల్‌తో తమను తాము మోటివేట్ చేసుకుని ఫస్ట్‌ప్లేస్‌లో నిలిచిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. వీళ్ళు తమను తాము కన్సల్టెంట్లుగా భావించుకోవాలి.. పైగా తమలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉందనేలా పెద్దోళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలి అని సైకాలజిస్టులు సిఫారసు చేశారు. స్కూలు స్థాయి దాటి కాలేజీ స్థాయికి వచ్చినవారిలో పరిణతిని చూస్తాం..ఇదే ఉదాహరణ అన్నది వీరి నిర్ధారణ !

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *