అడ్డంగా దొరికినా బుకాయిస్తావా..? మొగుడికి దేహశుద్ధి!

హరిప్రసాద్‌.. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో ఏవోగా పనిచేస్తుంటాడు. బొమ్మల రామారం మండలం నాగినేనిపల్లి స్కూల్లో హెడ్‌మిస్ట్రెస్‌గా చేసే నిర్మల అనే ఆమెతో ఇతడికి పదహారేళ్ళ కిందట పెళ్లైంది. కానీ.. ఇతగాడి బుద్ధి వంకర.  కలెక్టరేట్‌లో తనతో పాటు పని చేసే మరో మహిళతో భర్తకు అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న ఆరోపణలతో సస్పెన్షన్‌కి గురయ్యాడు. అయినా బుద్ధి మార్చుకోకుండా ఆమెతోనే ఉంటున్నాడని భార్య నిర్మల వాదిస్తోంది. గత రాత్రి వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారన్న సమాచారం తెలుసుకుని బంధువుల్ని తీసుకువెళ్లి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టిచ్చింది. అయినా.. తనకేమీ తెలీదని, ఆమెకీ తనకి సంబంధం లేదని హరిప్రసాద్ వాదిస్తున్నాడు. రివర్స్‌లో తనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి భార్యపై ఫిర్యాదు చేయబోయాడు. ఇప్పుడా పంచాయతీ పీఎస్‌లో కొనసాగుతోంది.