సైరాలో ఛాన్స్ వచ్చింది, సైన్ చేశా

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ల ‘ సైరా నరసింహా రెడ్డి ‘ చిత్రంలో నటించే ఛాన్స్ తనకు వచ్చిందని ఆనందంతో పొంగిపోతోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ సినిమాలో నాకు కీలక పాత్ర లభించింది. ఈ మధ్యే ఈ చిత్రానికి సైన్ చేశా అని తెలిపింది. బాహుబలిలాగే ఈ మూవీకూడా ఎన్నో భాషల్లో తెరకెక్కుతోందని, ముఖ్యంగా హిందీ మాట్లాడేవారు కూడా ఈ చిత్రాన్ని తప్పక ఆదరిస్తారని తమన్నా పేర్కొంది.

ఇక నందమూరి కళ్యాణ్ రాం తో తను చేస్తున్న ‘ నా నువ్వే ‘ సినిమా గురించి ప్రస్తావించిన ఈ అమ్మడు.. ఇందులోని ; చినికి..చినికి ‘ పాట తననెంతో ఎగ్జైట్ చేసిందని, చాలా కాలం తర్వాత లవ్ స్టోరీ చేస్తున్న తన రోల్ ని ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సి ఉందని చెప్పింది. సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల పారితోషికాల విషయంలో మెల్లగా అసమానతలు తగ్గుతున్నాయని మిల్కీ బ్యూటీ అభిప్రాయపడింది. హీరోలతో సమానంగా హీరోయిన్లకు కూడా పాత్రలు లభిస్తున్నాయని, దీంతో వుమెన్ ఓరిఎంటెడ్ సినిమాలు కూడా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటున్నాయని తమన్నా పేర్కొంది.