ఈ నెల 24‌న అమరావతిలో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతానని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్ర దేవ్ తెలిపారు. దేశంలోని అన్ని పార్టీలూ బీజేపీని ఓడించే లక్ష్యంతో ఏకమయ్యాయని,  రాష్ట్రంలో టీడీపీ బలంగా ఉందని ఆయన చెప్పారు. మోదీ పాలనలో ప్రజాస్వామ్యాన్ని తొక్కేశారు. బీజేపీని మట్టి కరపించాల్సిన అవసరం ఉంది అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన అనంతరం మొదటిసారి విజయనగరం చేరుకున్న కిషోర్ చంద్ర దేవ్.. కి మరో మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు సాదర స్వాగతం పలికారు. ‘రాజుగా’రి‌తో తనకెలాంటి విభేదాలు లేవని, అన్నదమ్ముల్లా కలిసి ఉన్నామని కిషోర్ చంద్ర దేవ్ స్పష్టం చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *