నీరవ్ మోదీని చెప్పుతో కొడతా

వజ్రాల వర్తకుడు నీరవ్ మోదీ పై సుజాత పాటిల్ అనే మహిళ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. నీరవ్ కు చెందిన ఫైర్ స్టార్ గ్రూప్ లో తన భర్త అర్జున్ పాటిల్ పదేళ్లుగా పని చేస్తుంటాడని, మిగతా ఉద్యోగుల్లాగానే ఆయన కూడా డాక్యుమెంట్లు తయారు చేస్తుంటాడని ఆమె అంటోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సంబంధించిన రూ. 11,400 కోట్ల స్కామ్ లో ప్రధాన సూత్రధారుడైన నీరవ్ ను తనదగ్గరకు తీసుకువస్తే చెప్పుతో కొడతానని సుజాత పాటిల్ ఆగ్రహంతో చెబుతోంది. ఈ మోసంలో తన భర్త పాత్ర ఏమీ లేదని, అతడు నెలకు 30 వేల వేతనం మాత్రమే తీసుకునే సామాన్య జీతగాడని ఆమె పేర్కొంది. కాగా…ఈ కుంభకోణానికి సంబంధించి నమోదైన తొలి ఎఫ్ఐఆర్ లో అర్జున్ పాటిల్ తో బాటు మరో 12 మందిని సీబీఐ అరెస్టు చేసింది.