ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు‌పై సోషల్ మీడియాలో వరుస విమర్శలు, సెటైర్లు సంధిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయిరెడ్డి మళ్లీ సందడిచేశారు. టీడీపీ నేతలు సీఎం రమేష్, సుజనా చౌదరిపై ఆదాయపు పన్ను(ఐటీ)శాఖ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులను నేపథ్యంగా చేసుకుని సరికొత్త దాడికి దిగారు.

టెక్నాలజీ సృష్టికర్త అని చెప్పుకునే ‘చంద్రబాబు పాస్ వర్డుల్లో సుజనాచౌదురి, సి.ఎం. రమేష్ ఇద్దరు దొరికారు. జైలు ఖాయం. జయభేరి మురళీమోహన్ చౌదరి, మంత్రి నారాయణలు కూడా పట్టుబడితే బినామీ ఖాతాలు చాలా వరకు బయట పడ్డట్టే’. అర్జంటుగా చంద్రబాబు మిగతా పాస్ వర్డులను మార్చి మిగిలిన దొంగ అకౌంట్లను ఓపెన్ కాకుండా జాగ్రత్తపడాలని ఎద్దేవా చేశారు.

ఇదిలాఉంటే, చంద్రబాబు కాంగ్రెస్ తో నెరపిన పొత్తు వ్యవహారం మీదా విజయసాయి విమర్శలకు దిగారు. కేటీఆర్ చెప్పినట్టు టీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకోవాలని చంద్రబాబు చూశారని అది కుదరకపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ తో జతకట్టారని ఇంతకంటే రాజకీయ వ్యభిచారం మరోటుంటుందా అని విజయసాయి విమర్శించారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *