బీజేపీ అధ్యక్షడు అమిత్‌ షా రెస్ట్ తీసుకోనున్నారా? ఆయన ప్లేస్‌లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు తీసుకునే ఛాన్స్ వున్నట్లు ఢిల్లీ సమాచారం. స్వైన్ ఫ్లూతో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో జాయిన్ అయ్యారు అమిత్ షా. మూడు లేదా నాలుగురోజుల తర్వాతే ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయనున్నారు. ఈలోగా జనవరి 20 నుంచి బెంగాల్‌లో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు బీజేపీ వరుస ర్యాలీలు కొనసాగనున్నాయి. అధ్యక్షుడు అమిత్ షా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వుండగా, జనవరి 20 నాటికి అమిత్ పూర్తిస్థాయిలో కోలుకోవడం కష్టమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన స్థానంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ యాత్రలకు నాయకత్వం వహిస్తారని చెబుతున్నారు. ఫిబ్రవరి 8న జరిగే చివరిర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. యాత్రలకు శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని దీదీ సర్కార్ చెప్పడంతో బహిరంగసభలు, పాదయాత్రలకు ప్లాన్ చేసింది బీజేపీ.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *