అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA)కి ఇప్పుడు 60వ వసంతం నడుస్తోంది. ఈ ఆరు దశాబ్దాల చరిత్రలో నాసా ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు చేసింది. విశ్వ శోధనలో ఇప్పటికీ అలుపెరుగని పోరాటంలో నిమగ్నమైంది. 60వ వార్షికోత్సవం సందర్భంగా.. నాసా చరిత్ర పుస్తకాన్ని ఒక్కసారి పరికించి చూస్తే..! ఇందులోని మొత్తం 400 అరుదైన జ్ఞాపక చిత్రాల్లో కొన్నిటిని తమ ఆర్కైవ్స్‌లోంచి బైటికి తీసింది నాసా. స్పేస్ రేస్, స్పేస్ షటిల్ ప్రోగ్రాంతో పాటు, తమ ఆస్ట్రోనాట్స్‌కి సంబంధించిన తీపి గురుతులు ఇందులో కనిపిస్తాయి.

  • 1969 మార్చిలో అపోలో 9 పైలట్ Dave Scott చంద్రమండలం యాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో ఉండగా తీసిన చిత్రం!

  • చంద్రుడి మీద మొట్టమొదటిసారి కాలుమోపిన వ్యోమగాములు Buzz Aldrin, Neil Armstrong.. అపోలో 11 స్పేస్ షిప్ లో వున్నప్పటి ఫోటో!

  • చంద్రుడి మీద నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ రీసెర్చ్ వెహికల్ ని లాండింగ్ చేస్తుండగా తీసిన ఫోటో.

  • స్పేస్ షటిల్ ‘ఎండీవర్’లో ప్రయాణిస్తున్న మొట్టమొదటి మహిళా ఆఫ్రో-అమెరికన్ మహిళ.

  • NASAలో Annie Easley అనే కంప్యూటర్ సైంటిస్ట్ Centaur రాకెట్ స్టేజ్ కోసం సాఫ్ట్ వేర్ రూపొందిస్తున్నప్పటి చిత్రమిది!

  • ప్రతిష్టాత్మక వ్యోమనౌక డిస్కవరీ 2005లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వద్ద పార్క్ చేస్తున్నప్పటి ఫోటో. దీన్ని 1984 నుంచి 30 సార్లు నింగిలోకి పంపారు.

  • ఫ్రాన్స్ లోని ఆర్ట్ సెంటర్ వద్ద నాసా వ్యోమగాముల వర్కింగ్ స్టిల్ !

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *