ఆధార్ గోప్యత అనేది ఒక శుద్ధ అబద్ధం అని మరోసారి తేలిపోయింది. గుట్టుగా వుంచుతారని మనమెంతో విశ్వాసంతో అప్పగించే ఆధార్ వివరాలు.. పరాయి చేతుల్లోకి ఎంత సులభంగా చేరిపోతాయో కళ్ళకు కట్టినట్లు చూపెడ్తుంది సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ. ఏకంగా ప్రభుత్వరంగ సంస్థలే తమ డొల్లతనాన్ని బైటపెట్టుకున్న విధం ఇది. ‘ఇండేన్-ఆధార్’ బాగోతం!

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఫ్రాంచైజీ ‘ఇండేన్’ గ్యాస్ కంపెనీ..! ఎల్పీజీ సిలెండర్ల పంపిణీకి సంబంధించి దేశవ్యాప్తంగా భారీ నెట్వర్క్ కలిగివుంది. కానీ.. డేటా సెక్యూరిటీ విషయంలో ఈ సంస్థ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తేలింది. ఇండేన్ డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లకు మాత్రమే యాక్సెస్ కలిగిన ప్రత్యేక వెబ్‌సైట్‌లోకి ఎవరైనా జొరబడవచ్చని ఫ్రెంచ్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్లు చెబుతున్నారు. దీన్ని ప్రాక్టికల్‌గా చేసి చూపెట్టిన బాప్టిస్ట్ రాబర్ట్ అనే హ్యాకర్.. తన దగ్గర 11 వేల మంది డీలర్ల వివరాలున్నాయంటూ ట్వీట్ చేశాడు. ఇండేన్ కంపెనీ మేలుకుని తన కస్టమ్-బిల్ట్ స్క్రిప్ట్‌ని బ్లాక్ చేయకపోతే.. 58 లక్షల మంది యూజర్ల డీటెయిల్స్ కూడా రెట్రీవ్ చేసి చూపెడతానని ఛాలెంజ్ చేశాడు కూడా.

తమ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే తప్ప డీలర్లు ఇండేన్ కంపెనీ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యే వీల్లేదు. కానీ.. గూగుల్ మీద ఈ వెబ్‌సైట్‌కి సంబంధించిన లింక్స్ సెర్చ్ చేయడం ద్వారా.. లాగాన్ కాకుండానే సైట్‌లోకి దూరిపోవచ్చని TechCrunch కథనం చెబుతోంది. ఈ లూప్‌హోల్‌ఃని ఆధారంగా చేసుకుని ఫ్రెంచ్ సైబర్ హ్యాకర్లు ఇండేన్ గుట్టు బైటపెట్టేశారట. ఇప్పటికైనా మేలుకోకపోతే.. 69 లక్షల మంది ఇండేన్ కస్టమర్లు తమ ఆధార్ సహా అన్ని వ్యక్తిగత వివరాల్ని బజార్లో పెట్టుకున్నట్లే లెక్క!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *