ఓ యువ మహిళా సింగర్నే బురిడీ కొట్టించాడో ప్రబుద్ధుడు.  గత ఏడాది ముంబైలో జరిగిన ఇండియన్ ఐడల్ రియాల్టీ షో‌లో పార్టిసిపెంట్ అయిన 23 ఏళ్ళ అవంతి పటేల్..ఇతని చేతిలో రూ.1.7 లక్షల సొమ్మును పోగొట్టుకుంది.  ఈ ఛీటర్ తానో బ్యాంకు ఉద్యోగినని చెప్పుకుని ఆమె డెబిట్ కార్డు వివరాలు తెలుసుకున్నాడని, ఆమెతో బాటు ఆమె సోదరి బ్యాంకు ఖాతా నెంబరు తదితరాలను కూడా సేకరించి..వారి నుంచి ఈ డబ్బు నొక్కేశాడని తెలిసింది. తమకు జరిగిన మోసాన్ని ఆలస్యంగా గ్రహించిన ఈ అక్క చెల్లెళ్ళు సియాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి దర్యాప్తు లో ఝార్ఖండ్‌కు చెందిన రాజ్ కుమార్ జయ నారాయణ్ మండల్ అనే ఈ మోసగాడి బండారం బయట పడి.. చివరికి ముంబై సైబర్ పోలీసులకు దొరికిపోయాడు.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *