”ఫిబ్రవరి 6 సాయంత్రం 4 గంటల 27 నిమిషాలకు ముంబైకి చెందిన ఒక ప్రముఖ డైమండ్ ట్రేడింగ్ కంపెనీ 4.51 క్యారట్ల గుండ్రటి వజ్రాన్ని 40 శాతం డిస్కౌంట్ మీద 8 లక్షలకు విక్రయించింది”. ఇంతటి లోతైన డీటెయిల్స్ ఇంత బహిర్గతం ఎలా అయ్యాయి.. ? వాళ్ళ నుంచి మాకు, మా నుంచి మీదాకా ఎలా వచ్చాయి? ఇది ఒక డేటా సంక్షోభం. కోట్లలో డీల్స్ జరిపే వజ్రాల వ్యాపారులు.. అంతటి విలువైన వాణిజ్యానికి సంబంధించిన సమాచారాన్ని తెలివిగా భద్రపర్చుకోవడంలో అట్టర్ ప్లాప్ అవుతున్నారు. ఫిజికల్ సెక్యూరిటీ మీద చూపెట్టే శ్రద్ధ.. సైబర్ సెక్యూరిటీ మీద పెట్టక పోవడం వల్ల డైమండ్ బిజినెస్ అతిపెద్ద ప్రమాదంలో చిక్కుకుందన్నది తాజా వాస్తవం.

బిల్ జెనరేట్ కాగానే సదరు ట్రేడర్‌కి సంబంధించిన వ్యక్తి ERP అనే ప్రత్యేక సాఫ్ట్‌వేర్ లో డీటెయిల్స్ అన్నీ గుడ్డిగా ఫీడ్ చేస్తున్నాడు. వజ్రం షేప్, సైజ్, క్వాలిటీ, ధర.. పార్టీకి మాత్రమే తెలియాల్సిన అన్ని వివరాలూ క్లౌడ్ బేస్డ్ డేటా బంప్‌లో డంప్ అవుతున్నాయి. రెండు వైపులా ఎన్‌క్రిప్షన్ లేని డేటా కావడంతో.. యూజర్ నేమ్, పాస్‌వర్డ్ అవసరం లేకుండానే ఎవరైనా ఇంటర్నెట్ ద్వారా ఈ డీటెయిల్స్‌లోకి ప్రవేశించే అవకాశముంది. ఇది ఈ ఒక్క డైమండ్ ట్రేడర్‌కి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. Fauna Technologies రూపొందించిన ఈ ERP program ని దేశంలోని అనేక దిగ్గజ డైమండ్ కంపెనీలు వాడుతున్నాయి. ఫిబ్రవరి 6న జరిగిన ఆ గుండ్రటి వజ్రం అమ్మకం తర్వాత.. వెంటనే ఢిల్లీ చాందినీ చౌక్‌లోని మరో జ్యుయెలర్ అటువంటివే నాలుగు వజ్రాలు రూ. 1.96 కోట్లకు అమ్మాడు. ఇలా ప్రతీ పర్చేజ్ డీటెయిల్స్ ఓపెన్ అయిపోతోందన్నది ఒక పెను సమస్య. అత్యంత గోప్యంగా జరగాల్సిన విలువైన వజ్రాల వ్యాపారం.. ఇలా రైతుబజార్లో కూరగాయల వ్యవహారంగా మారడానికి కారణం.. Fauna Technologies నిర్వాకమే!

ఫానా టెక్నాలజీస్ సీఈఓ పురవ్ ఆర్ చోక్సి మాటల్ని వింటే.. ఆ సంస్థ యొక్క డొల్లతనమెంతో ఇట్టే తేలిపోతుంది. ప్రస్తుతం ఆధ్యాత్మిక వైద్య ప్రక్రియ మీద దృష్టి పెట్టిన చోక్సి, ప్రాణిక్ హీలింగ్, అర్హటిక్ యోగ లాంటి అంశాల మీద వర్కవుట్ చేస్తున్నారు. ట్విట్టర్ సావీ అయిన ఈ పెద్దమనిషి సోషల్ మీడియాలో బీజేపీకి, మోదీకి భజన చేయడంతోనే టైమ్ పాస్ చేస్తారట. ఏడేళ్ల పాటు వీనస్ జ్యుయెలర్స్ అనే కంపెనీలో పనిచేసి.. ఆయాచితంగా Fauna Technologies లాంచ్ చేశారట. తనకున్న కాంటాక్ట్స్ వాడుకుని దేశవ్యాప్తంగా అనేకమంది వజ్రాల వ్యాపారులకు తన ERP programని అమ్ముకున్నాడు. వాళ్లందరితో డీల్ టైమ్ కూడా ముగిసిందని చెబుతున్న చోక్సి.. వేరే దారిలేక వాళ్లంతా తననే నమ్ముకున్నారంటూ ఒక వెర్రి నవ్వు నవ్వుతున్నాడు.

”వాళ్ళ డేటాకు ఫుల్-ప్రూఫ్ సెక్యూరిటీ కల్పించాలని నేను కూడా ప్రయత్నిస్తున్నా.. కానీ కుదిరి చావడం లేదు. నిజానికి ERP ప్రోగ్రాం గురించి నాక్కూడా పెద్దగా అవగాహన లేదు..” అంటూ తేలికమాటలతో సరిపెడ్తున్నాడు. ఇదీ.. ‘ఒక అనామకుడి చేతిలో చిక్కిన వేలకోట్ల వజ్రాల వ్యాపారం’ కథ! ఒక బీజేపీ వీరాభిమాని గుప్పిట్లో.. భారీ సైజు వజ్రాల వ్యాపారుల సమాచారం చిక్కుకోవడం దేనికి సంకేతం అన్నది మరో ప్రశ్న! ఇప్పటికే నిరవ్ మోదీ, మెహుల్ చోక్సి లాంటి వజ్రాల దొంగలు బ్యాంకులకు వేలకోట్ల టోకరా వేసి బైటిదేశాల్లో దాక్కున్నారు. ఇప్పుడీ చోటా చోక్సి మేటర్ ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *