ఇండియా ఫస్ట్ సెమీ-హైస్పీడ్ ట్రైన్ ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’‌కు కష్టాలు తప్పడం లేదు. ప్రారంభించిన మరుసటి రోజే మార్గ మధ్యం లో నిలిచిపోతోంది. ఢిల్లీకి 200కి.మీ దూరంలో పశువులు అడ్డుగా రావ‌డంతో పాటు  చ‌క్రాల్లో సాంకేతిక లోపం త‌లెత్తిందని అంటున్నారు. దాదాపు మూడుగంటలపాటు నిలిచిపోయింది. ఈ క్రమంలో రైలు ఆపాల్సి వ‌చ్చింద‌ని చెబుతున్నారు. రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులను ఇతర రైళ్లలో గమ్య స్థానాలకు చేర్చారు. వెంటనే రంగంలోకి దిగిన ఇంజనీర్లు, స‌మ‌స్యను ప‌రిష్కరించారు.

మళ్లీ 8:30 గంటలకు రైలు ఢిల్లీకి బయలుదేరింది. శుక్రవారం కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. దేశీయంగా తయారైన ఈ రైలు భారత్ మొట్టమొదటి సెమీ హైస్పీడ్‌ రైలు. దీన్ని శుక్రవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. గంటకు 180కి.మీ వేగంలో ప్రయాణించగల సామర్థ్యమున్న ఈ రైలు, శుక్రవారం 130 కి.మీ వేగాన్ని అందుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *