షాపింగ్ హ్యాబిట్ వున్న వాళ్ళను మరింత బానిసలుగా మార్చేసుకుంటోంది ఇన్‌స్టాగ్రామ్. ఫేస్‌బుక్ సొంతమైన ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్… తమ యూజర్లకు ఒక అరుదైన సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఎడ్వర్టయిజర్స్ వెబ్‌సైట్స్‌లోకి వెళ్లకుండానే.. సదరు కంపెనీ ఉత్పత్తుల్ని అక్కడికక్కడే నేరుగా కొనుగోలు చేసేలా ‘చెక్ అవుట్’ అనే ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది ఇన్‌స్టాగ్రామ్. ‘ఆన్‌పాయింట్ షాపింగ్ యాడ్స్’ సెక్టార్‌ని ఈ ఫీచర్ విపరీతంగా ప్రభావితం చేసే అవకాశం వుంది.

అడ్వర్టైజర్ వెబ్‌సైట్‌లోకి రీడైరెక్ట్ చేసే ఆప్షన్‌ని తొలగించిన ఇన్‌స్టా యాజమాన్యం.. తమ యూజర్లను తమ వెబ్‌సైట్‌లోనే ఉంచుకుని.. అక్కడినుంచే తోచిన వస్తువును కొనుగోలు చేసేలా ‘చెక్ అవుట్’ ఫీచర్‌ని తీర్చిదిద్దింది. మొదటిసారి పర్చేజ్ చేసేటప్పుడు మాత్రమే యూజర్ తమ పేమెంట్ డీటైల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని ఇన్‌స్టాగ్రామ్ భద్రపరిచి.. మరుసటి కొనుగోలు సమయంలో ప్రొవైడ్ చేస్తుందట.

ఇప్పటికే 20 వరకూ బ్యూటీ, ఫ్యాషన్ ఉత్పత్తుల్ని బేరానికి పెట్టేసింది. సో.. నిన్నటివరకూ ఒక సోషల్ మీడియా వెబ్‌సైట్‌గా వున్న ఇన్‌స్టాగ్రామ్.. ఇకనుంచి ఈ-కామర్స్ వెబ్‌సైట్‌గా కూడా సర్వీసెస్ ఇవ్వనుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *