సోషల్ మీడియా టూల్స్‌లో క్రమంగా పోటీ పెరిగిపోతోంది. ఒకదాన్ని మించి మరొకటి సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టుకుంటూ దూసుకుపోతున్నాయి. తాజాగా వాట్సాప్ యూజర్లను హైజాక్ చేయడానికి ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఎత్తుగడ వేసింది. వాట్సాప్‌లో వుండేలాంటి వాయిస్ మెసేజెస్ ఫీచర్ ఇప్పుడు మా దగ్గర కూడా లభ్యమవుతుంది అంటూ ఇన్‌స్టా నుంచి ప్రకటన వెలువడింది. ఏదైనా నచ్చిన పాట మీద చేసే కామెంట్, చూసిన ఫుట్ బాల్ మ్యాచ్ గురించి వ్యాఖ్య.. లాంటివన్నీ వాయిస్ రూపంలో పంపాల్సి వచ్చినప్పుడు ఈ వాయిస్ మెసేజింగ్ ఫీచర్‌ని వాడతారు.

టెక్స్ట్ మెసేజెస్ ద్వారా అవతలివాళ్ల మూడ్‌ని, స్వభావాల్ని పసిగట్టే వెసులుబాటు ఉండదు. కానీ వాయిస్ మెసేజెస్ మాత్రం.. సందేశం తాలూకు ఒరిజినాలిటీని యథావిధిగా ఫార్వార్డ్ చేస్తుంది. అందుకే.. వాయిస్ మెసేజింగ్ ఫీచర్‌కి ఇటీవల అధిక స్పందన లభిస్తోంది. వాట్సాప్ మీద మాత్రమే కాకుండా యాపిల్ వాచెస్‌లోని వాకీటాకీ యాప్ ద్వారా కూడా వాయిస్ మెసేజెస్ పంపే వీలుంది. ఇప్పుడు ఆ ఫీచర్‌ని అందిపుచ్చుకోవడం ద్వారా ఇన్‌స్టాగ్రామ్ కూడా క్రేజ్‌ని పెంచుకునే ఎత్తుగడ వేసింది. ఇక ఇన్ స్టా యూజర్లు కూడా ఎంచక్కా.. సొంత గొంతుతో హాయ్‌లు.. బాయ్‌‌‌లు చెప్పుకోవచ్చు. ఇకఇకలు పకపకల్ని పంచుకోవచ్చు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *