గ్లోబల్ ఐకాన్ ప్రియాంకచోప్రాకి సంబంధించి కొత్త వార్త హల్‌చల్ చేస్తోంది. ఆమె ప్రెగ్నెంట్ అంటూ బీటౌన్ మీడియా కోడై కూస్తోంది. పెళ్లయి కనీసం ఏడాది కూడా కాలేదు, అప్పుడే ప్రెగ్నెంట్ ఏంటి? పెళ్లికి ముందే గర్భం దాల్చిందా? అందుకే హడావిడిగా పెళ్లి చేసుకుందా? ఇలా రకరకాల వార్తలు హంగామా చేస్తున్నాయి. డిసెంబర్ ఒకటిన రాజస్థాన్ వేదికగా ప్రియాంక చోప్రా- నిక్‌జోనాస్‌లు పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే! ఐతే, పీసీ ప్రెగ్నెన్సీ వార్తకి కారణం ఇటీవల ఆమె పోస్ట్ చేసిన ఫోటోలేనట.

బేబీ బంప్‌ వున్నట్లుగా పీసీ పిక్‌లో కనిపించడంతో గర్భం దాల్చిందంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. చివరకు ఈ వార్త.. పీసీ మదర్ మధుచోప్రా చెవిలో పడిపోయింది. ఇంకేముంది దాన్ని ఖండించే ప్రయత్నం చేసింది. ప్రియాంక చోప్రా ప్రెగ్నెంట్ కాదని, కెమెరా యాంగిల్ సరిగా లేకపోవడమేనని తేల్చేసింది. దీనికితోడు డ్రస్సు కూడా పీసీ సెట్ కాలేదని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. ఒకవేళ అలాంటిది నిజమైతే అంతకంటే శుభవార్త ఏముంటుందని చెప్పారు.మొత్తానికి ఈ పుకార్ల నుంచి పీసీకి కాస్త రిలీఫ్ దొరికినట్టే!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *